
Clock Of Nellore ( Nellore ) – ఆదాల అంటే అభివృద్ధికి మారుపేరని, ప్రజలు ఈ ఎన్నికల్లో దీవిస్తే రూరల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తారని, తాను ఆయన బిడ్డగా మాటిస్తున్నానని పేర్కొన్నారు… నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబింధు. నెల్లూరు 31వ డివిజన్ లో హిమబింధు శనివారం ప్రచారం నిర్వహించారు. స్థానిక వైసీపి నేతలతో కలిసి టైలర్స్ కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంఛార్జ్ గా ఉంటూనే వేల కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, అదే ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెంత చేస్తారో అర్ధం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. తన తండ్రి పాతికేళ్ల రాజకీయ జీవితంలో కుటుంబం కంటే కూడా ప్రజా జీవితానికే ఎక్కువ సమయం కేటాయించారని, ప్రజా సేవకు ఆదాల ప్రభాకర్ రెడ్డి ముందుంటారని హిమబింధు పేర్కొన్నారు. వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్ లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆదాల ప్రభాకర్ రెడ్డిని దీవించాలని విజ్ఞప్తి చేశారు.