వైసిపి ప్రభుత్వంతోనే అభివృద్ధి : కందుకూరులో విజయసాయిరెడ్డి ప్రచారం

Clock Of Nellore ( Kandukuru ) – ఎస్సీ, ఎస్టీ, బీసీలు నివసించే ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో మళ్లీ వైసీపి ప్రభుత్వం రావాలని నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం యధావిధిగా కొనసాగాలంటే జగన్ మరో సారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కందుకూరు పట్టణంలోని 16వ వార్డులో శనివారం కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధి బుర్రా మధుసూదన్ యాదవ్ తో కలిసి విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తనకూ, ఎమ్మెల్యే అభ్యర్ధి బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజయసాయి రెడ్డి ప్రజలను కోరారు. ఎన్.డి.ఏ కూటమికి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, పథకాలు యధావిధిగా కొనసాగాలంటే మళ్లీ జగన్ సిఎంగా చేసుకోవాలని అన్నారు.

Read Previous

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉమ్మడి పోటీ : హమాలీల ఆత్మీయ సమావేశంలో నారాయణ

Read Next

మే 13న వైసీపికి ఎండింగ్ డే : ప్రచారంలో నారాయణ ధీమా

Leave a Reply

Your email address will not be published.