Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో పుట్టి పెరిగి, విద్యాభ్యాసం చేసిన తన తండ్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి ఈ ప్రాంతంపై అపారమైన ప్రేమ ఉందని నేహారెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని 47వ డివిజన్ లో తల్లి సునంద రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పొట్లూరి రామక్రిష్ణ, పార్టీ ఇతర నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా నెల్లూరు బిడ్డగా ఆయనకు ఈ ప్రాంతంపై ప్రత్యేకమైన ప్రేమ, అభిమానమని అన్నారు. పుట్టిన ఊరుపై ఎవ్వరికైనా మమకారం సహజమని అన్నారు. నెల్లూరు అభివృద్ధికి విజయసాయిరెడ్డి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేశారని, ఈ ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు యువత శారీరక దృఢత్వం మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. అలాగే నెల్లూరుకు రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. తన తండ్రి చేస్తానని మాట ఇస్తే చేసేంత వరకు నిద్రపోరని నేహారెడ్డి అన్నారు. తాము ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ప్రజలు ఎప్పుడైనా మా ఇంటి తలుపు తట్టవచ్చని, వారి సమస్యలు నేరుగా తమతో చెప్పుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నెల్లూరును తన తండ్రి అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డిని, సిటీ ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మరోమారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలంతా ఓటుతో దీవించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నేతలు ఖజానా శేషు, దండపాణి సురేష్, సీహెచ్ రామక్రిష్ణ,ఉమేనహీ బేగం, పుట్టా లక్ష్మి, శివకామి, కర్తం జ్యోతి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మెయిల్ల గౌరీ, పార్టీ మహిళా నేతలు హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
