Clock Of Nellore ( Vidavaluru ) – కోవూరు నియోజకవర్గంలో అవినీతికి తావు లేని అభివృద్ధి చేసి చూపిస్తామని వేమిరెడ్డి దంపతులు అన్నారు. విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతికి టీడీపీతో పాటు మిత్రపక్ష జనసేన, బిజెపి కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు మాట్లాడుతూ అవినీతితో పాటు నాయకుల నిర్లక్ష్యం గ్రామాల్లో అభివృద్ధికి ఆటంకమైందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందివ్వడంలో చంద్రబాబు నాయుడుకు ఎవరూ సాటి రానన్నారు. మీరందరు ఆశీర్వదించి మమ్మల్ని పార్లమెంటు మరియు అసెంబ్లీకి పంపిస్తే రానున్న అయిదేళ్లలో అవినీతిరహిత కోవూరు నియోజకవర్గంగా మారుస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కై కృషి చేస్తామన్నారు. మీ అందరి సహకారం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రోత్సాహంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత తాను తీసుకుంటామన్నారు. అయిదేళ్ళ పాటు సాగిన నియంతృత్వానికి తెరపడి త్వరలో చంద్రబాబు నేతృత్వంలో ప్రజా పాలన రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరందరూ ఆశీర్వదించి కోవూరు శాసనసభ్యురాలిగా మరియు పార్లమెంట్ సభ్యులుగా తమను గెలిపించాల్సిందిగా వేమిరెడ్డి దంపతులు ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రబాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
