నెల్లూరు రూరల్ లో జనసేన ప్రచారం : కోటంరెడ్డిని గెలిపించాలని విన్నపం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. టిడిపి – జనసేన ఉమ్మడి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలన్న లక్ష్యంతో ప్రవాస భారతీయులు కొట్టే ఉదయ్ భాస్కర్ ప్రచార వాహనాలు సమకూర్చి రూరల్ నియోజకవర్గంలో ప్రచారం చేయించనున్నారు. ఈ వాహనాలను సోమవారం తన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే నెల్లూరు సిటీలో ప్రచారాన్ని పూర్తి చేసిన నేతలు, ఇవాళ నుండి రూరల్ నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నెల్లూరుజిల్లా జనసేన ప్రచార నిర్వాహకులు కొట్టే వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఈ ప్రచార వాహనాలు తిరగనున్నాయి. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ జనసేన – తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా ఈ వాహనాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.

Read Previous

రవాణా అధికారుల ఫిర్యాదు మేరకే కేసు, తనీఖీలు : వివరణ ఇచ్చిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

Read Next

టిడిపి ప్రభుత్వంతోనే ఉజ్వల భవిష్యత్తు : ప్రచారం నిర్వహించిన కోటంరెడ్డి కుటుంబం

Leave a Reply

Your email address will not be published.