నెల్లూరులో ఇన్ స్పైర్ సైన్స్ ఫేర్ : ప్రారంభించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఈ తరం విద్యార్థులకు ఒక వరం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని దర్గామిట్ట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహించిన ఇన్‌స్ఫైర్‌ మనాక్‌ 2022 – 2023 శాన్త్ర సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీ పడేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న తేడాను అందరూ గమనించాలన్నారు. ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. డిజిటల్‌ విద్యాబోధన, ఫర్నీచర్‌, పరిశ్రుభమైన టాయిలెట్స్‌, నోట్‌ బుక్స్‌, పుస్తకాల పంపిణీ, నాణ్యమైన భోజనం, షూలు, బెల్టు, యూనిఫాం ఇలా విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పోటీపడేలా చేసిన ఏకైక సీఎం జగన్మోహన్‌రెడ్డి అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని లక్షలాది రూపాయల ఖర్చుతో కూడిన, కార్పొరేట్‌ విద్యా సంస్థలకే సాధ్యమయ్యే ఐబి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టి మన విద్యార్థుల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సీఎం జగన్‌ అని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు తమ ప్రతిభాపాఠవాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా జిల్లా కీర్తిప్రతిష్టలను రెపరెపలాడిరచాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ స్రవంతి, జిల్లా విద్యా శాఖాధికారి పి. రామారావు, సమగ్ర శిక్ష ఏపిసి ఉషారాణి, డిప్యూటీ డిఇవోలు లక్ష్మీ ప్రసన్న, రఘురాం, శ్రీనివాసులు, హెచ్‌ఎం పి.వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం : బడ్జెట్ కు ఆమోదం

Read Next

జెఇఇ మెయిన్స్ పరీక్షల్లో నారాయణ విద్యార్ధుల ప్రతిభ : అభినందించిన డైరెక్టర్ షరణి

Leave a Reply

Your email address will not be published.