Clock Of Nellore ( Nellore ) – పోటీ పరీక్షలు ఏవైనా నారాయణ విద్యాసంస్థలదే అగ్రస్థానం అని మరోసారి నిరూపితమైందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ షరణి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం N.T.A విడుదల చేసిన జె.ఇ.ఇ (మెయిన్ ) – 2024 పరీక్షా ఫలితాలలో నారాయణ ఐఐటీ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో 8 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్స్ సాధించారని తెలిపారు. నారాయణ విద్యాసంస్థలకు ఇంకెవరు లేరు సాటి అనే విధంగా ఫలితాలు రాబట్టారు. దీంతో నారాయణ విద్యార్థులు, అధ్యాపకులు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ షరణి నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
అత్యత్తమ బోధనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నారాయణ విద్యాసంస్థల్లో మెరుగైన విద్యాబోధన విద్యార్థుల ట్యాలెంట్‌కు అనుగుణంగా చెబుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ లో విడుదలైన ఫలితాల్లో 300 లకు 300 మార్కులు ఏకంగా ఆరు మంది విద్యార్థులు సాధించారన్నారు. జాతీయస్థాయిలో పలు బ్రాంచ్‌ల నుంచి సాయితేజ (హైటెక్‌సిటీ, హైదరాబాద్), షేక్ సూరజ్ (నెల్లూరు), ఆర్ఎన్ ప్రకాష్ (ముంబాయి), రోహన్‌సాయి (ఎస్ఆర్ నగర్, హైదరాబాద్), హెచ్. విభిత్ (హైటెక్స్, హైదరాబాద్), ఎం.అనూప్ (హైటెక్స్, హైదరాబాద్), అమోగ్ అగర్వాల్ (బెంగుళూరు), దినేష్‌రెడ్డి (హైటెక్స్, హైదరాబాద్) 8 మంది విద్యార్థులు 300 లకు 300 మార్కులు సాధించారని తెలిపారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఓవరాల్‌గా 11 లక్షల మంది పైగా రాయగా, అందులో ఇండియా మొత్తం మీద 23 మంది విద్యార్థులు 100 శాతం మార్కులు అంటే 300 మార్కులు సాధించారని చెప్పారు.
దానిలో నారాయణ ఐఐటీ అకాడమీ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు సత్తా చాటడం అభినందనీయమని కొనియాడారు. సిక్స్ గ్రేడ్ నుంచే నారాయణ విద్యాసంస్థల్లో ఓలంపియాడ్, ఐఐటీ, నీట్ ట్రైనింగ్స్ ఇస్తున్నట్లు చెప్పారు. ఫైనల్‌గా 11, 12 గ్రేడ్‌కి వచ్చేసరికి పోటీ పరీక్ష ఏదైనా తమ విద్యార్థులకే ఉత్తమ ఫలితాలు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ పొంగూరు నారాయణ ఫౌండేషన్, రిపిటేషన్స్‌కే ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. విద్యార్థి ఏ దశలో ఉన్నామో గమనించి వారికి విద్యను బోధించడం జరుగుతుందన్నారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక అధ్యాపకేత బృందానికి నారాయణ విద్యాసంస్థల తరపున ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. నారాయణ విద్యాసంస్థల్లో పటిష్టమైన మైక్రో షెడ్యూల్, బోధన పద్ధతులు, పరీక్షా విధానాల వల్ల తమ విద్యా సంస్థల విద్యార్థులు ఇంతటి అత్యుత్తమ ఫలితాలు సాధించారని అభిప్రాయపడ్డారు. 300 లకు 300 మార్కులు 8 మంది విద్యార్థులు సాధించగా, వారితో పాటు 90 శాతం లోపు పర్సెంటైల్స్ సాధించిన వారు వందల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. 2024 2025 విద్యాసంవత్సరం ఆరంభంలో ఇంతటి ఘనవిజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం ఉత్తమ పర్సెంటైల్స్ సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
