Clock Of Nellore ( Nellore ) – త్వరలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ మీ వాడిగా మీతోనే ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఖలీల్ అహ్మద్ స్పష్టం చేశారు. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఖలీల్, నెల్లూరు నగర అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. నజీర్ తోట షాదీ మంజిల్ శుక్రవారం ఆయన వైసీపి నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 8, 10, 11వ డివిజన్లకు సంభందించిన నిర్వహించిన ఈ సమావేశంలో కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశానికి రోల్ మోడల్ అని కొనియాడారు. సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని వైసీపి నేతలను, కార్యకర్తలను కోరారు. తనను గెలిపిస్తే మీవాడిగా నిత్యం మీతోనే ఉంటానని పేర్కొన్నారు.
