Clock Of Nellore ( Nellore ) – త్వరలో జరిగే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ వారి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న ప్రచారంకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజిత, కుమార్తెలు హైందవి, వైష్ణవి… ముగ్గురూ కలిసి ప్రతీ రోజూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తున్న కోటంరెడ్డి కుటుంబసభ్యులకు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. మరో వైపు శుక్రవారం వారు 22వ డివిజన్ లోని బివి నగర్, ఎన్జీఓ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధించారు. మరో వైపు 21వ డివిజన్ వైసీపి నేత కృష్ణమోహన్ రెడ్డి కోటంరెడ్డి సుజిత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
