బాల్య వివాహాలను అరికట్టాలి : కార్యాచరణ రూపొందించాలన్న కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో కలెక్టర్ హరి నారాయణన్, రెవెన్యూ, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బాల్య వివాహాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యపై సమీక్షించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రెవెన్యూ, పోలీసు, విద్యా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేస్తూ కౌమార దశలో ఉన్న బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పాఠశాలల్లో పెద్ద ఎత్తున ప్రచార మరియు అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా కార్యక్రమాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో వున్న 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికల వివరాలను సిద్ధం చేయాలని ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యా శాఖాధికారి గంగా భవానీ, ఐసిడిఎస్ పిడి హేమ సుజన తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఘనంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర : ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

Read Next

నెల్లూరు రూరల్ లో సంఘీభావ సదస్సులు : ప్రజల్లోకి వెళ్లనున్న కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.