Clock Of Nellore ( Amaravathi ) – ఇవాళ్టి నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు టిడిపి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. హాజరుకు ముందు అసెంబ్లీ వరకూ పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి భాలకృష్ణ ఆధ్వర్యంలో వారంతా అసెంబ్లీ వరకూ నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు వైసీపి బహిష్క్రృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అసెంబ్లీలో కూడా టిడిపి నిరసన వ్యక్తం చేయగా స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి ఎమ్మెల్యేలను ఒక రోజు పాటూ సస్పెండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద అనుచితంగా ప్రవర్తించారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్ లను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.