Clock Of Nellore ( Kodavaluru ) – నెల్లూరుజిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి నెల్లూరు వస్తున్న కావేరి ట్రావెల్ బస్సు కొడవలూరు మండలం, రాజుపాళెం టపాతోపు సెంటర్ లో ఆగింది. అప్పుడే కొందరు ప్రయాణీకులు బస్సు నుండి దిగుతుండగా వెనుకవైపు నుండి లారీ ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 12 మంది ప్రయాణీకులు ఉన్నారు. లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా బస్సు కుదుపుకు గురైంది. బస్సులోని కొందరు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. మరో వైపు లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.
