Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ప్రధాన రైల్వే స్టేషన్ లో వాచ్ మెన్ దారుణ హత్యకు గురైనాడు. రైల్వే స్టేషన్ తూర్పు టెర్మినల్ వైపు వాచ్ మెన్ విధులు నిర్వహించే సుబ్రమణ్యం రైల్వే స్టేషన్ సమీపంలో చనిపోయి ఉండగా కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా తలకు తీవ్రమైన గాయాలు ఉన్నాయి. దీంతో అది హత్యగా నిర్ధారించారు. రైల్వే స్టేషన్ వద్ద పగలు రాత్రి తేడా లేకుండా ప్రయాణీకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మరో వైపు రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాల్లో రాత్రి పూట గంజాయి మత్తులో జులాయిలు కూడా తిరుగుతుంటారు. ఈ క్రమంలో ఎవరైనా వాచ్ మెన్ తో ఘర్షణ పడి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.