నెల్లూరుజిల్లాలో 12వేల 72 మందికి భరోసా సాయం : అందజేసిన జడ్పీ ఛైర్మైన్ అరుణమ్మ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో 12,072 మంది అర్హులైన మత్స్యకార కుటుంబాలు వైయస్సార్ మత్స్య కార భరోసా పథకం క్రింద లబ్ది పొందారని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం 1లక్షా 23 వేల మంది కి 123 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మత్స్యకారుల ఖాతాలో జమ చేశారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయ తిక్కన ప్రాంగణం నుండి జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ , జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆనం అరుణమ్మ విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 12072 మంది మత్స్యకారులు 12 కోట్ల 7 లక్షల లబ్ది పొందారని ఆమె అన్నారు. మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ బృతిని ఈ ప్రభుత్వం 2019 నుండి 4 వేల నుండి 10వేలకు పెంచిందని ఆమె పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎం నాగేశ్వరరావు, ఏడీలు విజయ కృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నవాబుపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

Read Next

గుండె జబ్బులకు కారణం హైపర్ టెన్షన్ – జాగ్రత్తలు తెలియజేసిన మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.