నవాబుపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు కేసులకు సంభందించిన రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణంలో శిథిలావస్థలో ఉన్న వాహనాలను కోర్టు అనుమతితో వేలం వేయాలని సిఐ సుబ్బారావుకు సూచించారు. పోలీస్ స్టేషన్ మ్యాప్, చార్ట్ ను పరిశీలించి నేర, శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. గ్రేవ్ కేసుల సిడి ఫైల్స్ ను పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంభందిత కుటుంబ తగాదాలు, మిస్సింగ్ కేసుల విషయాల్లో సత్వరమే స్పందించి న్యాయం చేయాలని సిఐని ఎస్పీ ఆదేశించారు. చోరీ కేసుల్లో ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్ఠి సారించాలని, పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని, నేరస్తులకు కోర్టుల్లో శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు, ఆధారాల సేకరణ, సాక్షాధారాలను సేకరించే విధంగా పని చేయాలని చెప్పిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి… పోలీస్ సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని, ప్రతీ శుక్రవారం జరిగే పోలీస్ గ్రీవెన్స్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సిబ్బందిని కోరారు.

 

Read Previous

కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ స్రవంతి తనిఖీలు

Read Next

నెల్లూరుజిల్లాలో 12వేల 72 మందికి భరోసా సాయం : అందజేసిన జడ్పీ ఛైర్మైన్ అరుణమ్మ

Leave a Reply

Your email address will not be published.