రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్ : చుక్కల భూములకు విముక్తి

Clock Of Nellore ( Kavali ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన పర్యటనను ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులను విడుదల చేసింది. శుక్రవారం ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరనున్న సిఎం జగన్… ఉదయం 10:30 గంటలకు నెల్లూరుజిల్లాలోని కావలి పట్టణానికి చేరుకుంటారు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో సిఎం హెలికాప్టర్ 10:30 ల్యాండ్ అవుతుంది. అక్కడి నుండి ఆయన సమీపంలోని మినీ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి సమస్యగా ఉన్న చుక్కల భూములను నిషేదిత 22 ఏ జాబితా నుండి అధికారికంగా తొలగించి, ఆయా భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పించనున్నారు. బహిరంగ సభ అనంతరం మద్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్ ద్వారా తిరిగి తాడేపల్లికి తిరిగి వెళ్తారు. మరో వైపు సిఎం రాక నేపద్యంలో జిల్లా అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు.

Read Previous

సవాళ్లు… ప్రతి సవాళ్లు… వేదికగా మారిన కన్యకా పరమేశ్వరి ఆలయం

Read Next

చుక్కల భూములకు మోక్షం : కావలి సభలో హక్కులు కల్పిస్తూ సిఎం జగన్ పత్రాల పంపిణీ

Leave a Reply

Your email address will not be published.