
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్ లో ఉన్న SBI ఏటీఎం అగ్నికీలల్లో చిక్కుకుంది. శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏటిఎం సెంటర్ లో మంటలు వ్యాపించాయి. నిముషాల వ్యవధిలో ఆ మంటలు ఏటిఎం మిషన్ కు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో ప్రజలు అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోగానే ఏటిఎం మిషన్ పూర్తిగా దగ్ధమైంది. మిషన్ లోని 70 లక్షల నగదు కూడా పూర్తిగా కాలిపోయి బూడిదైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఏటిఎం మిషన్ పూర్తిగా కాలిపోయింది. కరెన్సీ నోట్లు కూడా బూడిదై దర్శనమిచ్చాయి. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణమా ఇంకేదైనా ఉందా అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. అలాగే నగదు ఎంత కాలిపోయింది అనేది కూడా బ్యాంకు అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.