Clock Of Nellore ( Venkata Chalam ) – మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరుజిల్లా పర్యటన ముగిసింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన నాలుగు రోజుల క్రితం నెల్లూరుకు విచ్చేశారు. కార్యక్రమాలు ముగియడంతో శనివారం మధ్యాహ్నం చెన్నై బయలుదేరి వెళ్లారు. మరో వైపు శనివారం ఉదయం వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఉన్న వెంకయ్య నాయుడును… రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం కొద్ది సేపు వివిధ అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు.
