రంజాన్ పండుగకు ఏర్పాట్లు : బారా షహీద్ దర్గాను సందర్శించిన ఎంపి ఆదాల

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 22వ తేదీనా జరిగే రంజాన్ పండుగకు నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఎంపి, నెల్లూరు రూరల్ వైసీపి ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బారా షహీద్ దర్గాను సందర్శించారు. ముందుగా బారా షహీదుల సమాధుల వద్ద ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు, అధికారులతో పండుగ ఏర్పాట్లపై అక్కడే సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగకు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే నేపద్యంలో దర్గాలో వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే త్వరలో నిర్వహించే రొట్టెల పండుగను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. తన కృషి వల్లే బారా షహీద్ దర్గాలో మసీదు నిర్మాణం, దర్గా అభివృద్దికి ముఖ్యమంత్రి 15 కోట్లు మంజూరు చేశారన్నారు. నిధుల విడుదలకు ఫైనాన్స్ క్లియరెన్స్ అవుతుందని తెలుసుకుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పోరాటం అని ప్రకటించారని, నిధుల విడుదల తర్వాత తన పోరాటంతోనే నిధులు విడుదల అయినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో కూడా పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, అది తెలుసుకుని మళ్లీ పోరాటం అంటున్నారని నాలుగేళ్లలో ఏమీ చేయలేని ఎమ్మెల్యే ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని ఆదాల పేర్కొన్నారు.

 

Read Previous

జూన్ 2వ వారం కల్లా నాడు – నేడు పనులు పూర్తి కావాలి : అధికారులను ఆదేశించిన కలెక్టర్

Read Next

నూతన ఎస్పీని కలిసిన జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ

Leave a Reply

Your email address will not be published.