Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. 103వ రోజైన గురువారం ఆయన 53వ డివిజన్ లోని గాంధీ గిరిజన కాలనీలో ఇంటింటికి వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2024 ఎన్నికల్లో వైసీపికి మరో సారి అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు చెెబుతున్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నామని, ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవరకొండ సుజాత తదితరులు పాల్గొన్నారు.
