ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడు : సంచలన ప్రకటన చేసిన నెడుమారన్

Clock Of Nellore ( Nellore ) – ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌ బతికే ఉన్నాడని తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రభాకరన్‌ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. కుటుంబసభ్యులతో ఆయన టచ్‌లో ఉన్నట్టు కూడా తెలిపారు. ప్రభాకరన్‌ చనిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తమన్నారు నెడుమారన్‌. తాను బతికే ఉన్నట్టు ప్రజలకు చెప్పమన్నారని, అందుకే మీడియా ముందుకు వచ్చినట్టు నెడుమారన్‌ చెప్పారు. 2009లో ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్‌ చనిపోయినట్టు అప్పటి శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. 18 మే 2009 న ప్రభాకరన్ కుమారుడు చార్లెస్ ఆంథోనీ కూడా పోరులో చనిపోయారు. ప్రభాకరన్‌ చనిపోయారని, ఆయన మృతదేహం ఫోటోలను కూడా శ్రీలంక సైన్యం విడుదల చేసింది. కాని 14 ఏళ్ల తరువాత ఆకస్మాత్తుగా ఆయన బతికే ఉన్నారని నెడుమారన్‌ నుంచి స్టేట్‌మెంట్‌ రావడం సంచలనం రేపింది. నిజాలేంటో తెలియాల్సి ఉంది.

Read Previous

నెల్లూరులో భారీ చోరీ : ముసుగులు ధరించి బంగారం, నగదు దోపిడి

Read Next

నెల్లూరు కోర్టు ప్రాంగణంలో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధి శ్రీకాంత్ ప్రచారం

Leave a Reply

Your email address will not be published.