నెల్లూరు రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు : వెల్లడించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని వైసీపి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు 34వ డివిజన్ లోని జడ్పీ కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మించే సిమెంటు రోడ్డు పనులను నగర మేయర్ స్రవంతితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయాలకు మంజూరైన నిధులతో ఆయా సచివాలయాల పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్ధేశించిన సమయానికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయని గిరిధర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రియాజ్, వైసీపి నేతలు పోట్లూరి జయవర్ధన్, మస్తాన్, అహ్మద్, యూసఫ్, మల్లిఖార్జున రావు, సునీత, రవికుమార్ పాల్గొన్నారు.

Read Previous

లోకేష్ పాదయాత్రపై మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనీల్ సెటైర్లు

Read Next

వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్

Leave a Reply

Your email address will not be published.