పెన్షన్ల రద్దుపై రీ వెరిఫికేషన్ చేయండి : సచివాలయ సిబ్బందికి మాజీ మంత్రి అనీల్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – పెన్షన్ల పెంపు నేపద్యంలో వివిధ కారణాలతో అనేక మందికి పెన్షన్లు రద్దు అయిన విషయం తెలిసిందే. పెన్షన్ల రద్దుతో అనేక మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి లబోదిబోమంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 3వేల మందికి పెన్షన్లు రద్దు అయినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం నాడు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరితకు ఫోన్ చేసి వెంటనే రీ వెరిఫికేషన్ చేసి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. తాజాగా సోమవారం మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కూడా పెన్షన్ల రద్దుపై స్పందించారు. నగరంలోని ఎం.సి.ఎస్ కళ్యాణ మండపంలో కార్పొరేటర్లు, సచివాలయ అడ్మిన్లు, సిబ్బందితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎంత మందికి పెన్షన్లు రద్దయ్యాయే అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ఏ పేదవాడికి అన్యాయం జరగకూడదని సూచించారు. రద్దు అయిన పెన్షన్లకు సంభందించి వెంటనే రీ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.

Read Previous

“పోరాడితే పోయేదేముంది బానిక సంకెళ్లు తప్పా” ! : సంచలనం రేపుతున్న కోటంరెడ్డి వ్యాఖ్యలు

Read Next

అర్హత ఉంటే పెన్షన్లు పునరుద్ధరిస్తాం : స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

Leave a Reply

Your email address will not be published.