Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసి రాచాల రవికుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈనెల 17వ తేదీనా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలతో కలిసి వైసీపిలోకి వెళ్లనున్నారు. ఈ నేపద్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరులోని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 17వ తేదీ జరిగే పార్టీలో చేరిక కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.