Clock Of Nellore ( Nellore ) – దేవ్ గోజుర్యూ కరాటే డో ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు, గ్రాండ్ మాస్టర్ హన్ షి వి. దేవానంద్ జన్మదిన వేడుకలు నెల్లూరులో కరాటే మాస్టర్లు ఘనంగా నిర్వహించారు. దేవ్ గోజుర్యూ కరాటే డో ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ ఏపి అధ్యక్షులు షిహాన్ ఎన్. వెంకట రమణ… నెల్లూరులోని వారి శిక్షణా కేంద్రంలో జన్మదిన వేడుకలను నిర్వహించగా పలువురు కరాటే మాస్టర్లు, శిక్షణ విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తోటి మాస్టర్లతో కలిసి ఎన్. వెంకట రమణ కేట్ కట్ చేసి దేవానంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్యాలతో ఉండాలని కాంక్షించారు. వేల మందికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చిన దేవానంద్… మార్షల్ ఆర్ట్స్ లో భారత దేశానికి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఆయన నెల్లూరు వాసి కావడంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో కరాటే మాస్టర్లు ఎన్. మురళి, వసంత్ కుమార్, శర్వాణి, ప్రదీప్ కుమార్, అశోక్ కుమార్, శిక్షణ విద్యార్ధులు పాల్గొన్నారు.