హాస్టల్స్ విద్యార్ధుల పరిస్థితి దారుణం : పరిష్కరించాలన్న TNSF నేతలు

Clock Of Nellore ( Nellore ) – ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ విద్యార్ధుల పరిస్థితి రోడ్డు మార్జిన్లలో నిద్రించే అనాథల కన్నా దారుణంగా ఉందని తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ( TNSF ) నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ అమృల్లా తీవ్ర స్థాయిలో విమర్శించారు. హాస్టల్స్ విద్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అమృల్లా మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ విద్యార్ధులకు దుప్పట్లు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ఈ చలికాలంలో విద్యార్ధులు రాత్రి నిద్రించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేక హాస్టల్స్ భవనాల్లో శ్లాబు పెచ్చులు ఊడుతున్నాయని, వాటికి వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో విద్యార్ధులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచారని, పెంచిన ఛార్జీలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అమృల్లా హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో TNSF నాయకులు వసీం, మారుతి, మణి, హేమంత్, నరేంద్ర, వెంకట్ యాదవ్, రవీంద్ర, రాజేష్, రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఈనెల 20న ప్రీ క్రిస్మస్ వేడుకలు : ఏర్పాట్లు పరిశీలించిన కోటంరెడ్డి సోదరులు

Read Next

మైనార్టీల అభివృద్ధికి సిఎం జగన్ విశేష కృషి : మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.