Clock Of Nellore ( Nellore ) – గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం 21వ డివిజన్ లో మాగుంట లే అవుట్ లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అపార్ట్ మెంట్ల వద్ద అందులో నివాసం ఉండే వారందరితో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి సమావేశమయ్యి ప్రభుత్వ పథకాలను వివరించారు. అర్హులందరికీ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21వ డివిజన్ కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలసి ఆత్మీయ సమావేశం నిర్వహించి వారితో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికి కార్పొరేటర్ మొయిళ్ల గౌరి తదితరులు పాల్గొన్నారు.
