ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముస్లింల సత్కారం : ఎప్పుడూ అండగా ఉంటామని హామీ

Clock Of Nellore ( Nellore ) – తమ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడంతో పాటూ తమ అండగా ఉంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని పలువురు ముస్లింలు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం 34వ డివిజన్ లోని ప్రగతి నగర్ 10వ వీధిలో కోటంరెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడున్న ఓ మసీదు వద్ద ముస్లింలు కోటంరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ముస్లిం సమాజానికి అండగా ఉంటున్నారని, తమ సమస్యలపై ఎప్పటికప్పుడూ స్పందిస్తూ ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా ముస్లింలు అన్నారు. కోటంరెడ్డికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో కోటంరెడ్డి స్పందిస్తూ ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ ఫామిద, వైసీపి నేతలు మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నారాయణ కళాశాల భవనంపై పిడుగు : దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు

Read Next

ఓవెల్ స్కూల్ గుర్తింపు రద్దు చేసిన అధికారులు : ఇతర స్కూళ్లకు విద్యార్ధులు

Leave a Reply

Your email address will not be published.