నెల్లూరులో ఘనంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నెల్లూరులోని వారి నివాసంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రజా ప్రతినిధులు, వైసీపి నేతలు, అధికారులు హాజరయ్యి కాకాణి జన్మదిన వేడుకలు తెలియజేశారు. స్కూల్ విద్యార్ధుల సమక్షంలో కేక్ కట్ చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి… తన జన్మదినం నాడు పలువురు బహుకరించిన స్కూల్ పిల్లలకు అవసరమైన నోటు పుస్తకాలు, బ్యాగులు, వివిధ వస్తువులను విద్యార్ధులకు బహుకరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కాకాణికి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్మైన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ హరిత, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, వైసీపి నేత ఆనం రంగమయూర్ రెడ్డి, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవి రామిరెడ్డి, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి… కాకాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల అనంతరం మంత్రి హైదరాబాద్ కు పయనమై వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి కాకాణికి ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విఐపి లాంజ్ లో ఆయనచే కేక్ ను కట్ చేయించారు.

Read Previous

నాయుడుపేటలో హీరో మంచు మనోజ్…

Read Next

మార్చి తర్వాత నాడు – నేడు చూపిస్తా : మాజీ మంత్రి అనీల్ కుమార్ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.