Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పక్కన గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద ఈనెల 7వ తేదీనా కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం ఆయన వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో భాగంగా నెల్లూరు చెరువులో 30 మంది మత్స్యకారులు పడవల్లో శివ కేశవుల జెండాలు, దీప కాగడాలతో గణేష్ నిమజ్జన ఘాట్ లో శివలింగ ఆకృతిగా ఏర్పడనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా కోటంరెడ్డి సోదరులు చెరువులో బోట్ ట్రయల్ రన్ వేశారు. సోమవారం జరిగే కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు నగర ప్రజలంతా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
