Clock Of Nellore ( Nellore ) – అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ సిబ్బంది పనిచేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నగరంలోని 27వ డివిజన్ పోలీస్ కాలనీలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు, సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా పనిచేయాలన్నారు. నీరు, రోడ్లు, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్ఠి సారించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భీమినేని మురహరి తదితరులు పాల్గొన్నారు.
