Clock Of Nellore ( Nellore ) – నవంబర్ 7వ తేదీనా నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ నిర్వహణకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీని ఏర్పాట్లపై ఆదివారం ఆయన తన కార్యాలయంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, మాజీ మేయర్ భానుశ్రీ, మహిళా కార్పొరేటర్లు, వైసీపి మహిళా నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై వారితో చర్చించారు. నవంబర్ 7వ తేదీనా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేలా అందరూ కృషి చేయాలని సూచించారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు కేరళ రాష్ట్ర మహిళల పంబ మేళ, కోలాటాలు, మహిళలచే మంగళ వాయిద్యాలు, ఇతర సాంస్క్రృతిక కార్యక్రమాల నడుమ శోభాయాత్ర నిర్వహిస్తామని, సాయంత్రం 6 గంటలకు ఘాట్ వద్ద హరిద్వార్ నుంచి వచ్చే అర్చకుల ఆధ్వర్యంలో 1008 మంది మహిళలతో గంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమాలను నెల్లూరు నగర మహిళలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
