రాష్ట్రం సుభిక్షంగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – లక్ష్మీదేవి ఆశీస్సులతో త్వరలోనే రాష్ట్రం సుభిక్షంగా మారే రోజులు రానున్నాయని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో పవనన్న ప్రజాబాట పేరుతో ఆయన గడప గడపకు తిరుగుతున్న విషయం తెలిసిందే. 160వ రోజైన ఆదివారం 48వ డివిజన్ లోని విరాట్ నగర్ లో వినోద్ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేతంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నివసించే ప్రజలు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. ప్రజల బాధలన్నీ తీరే రోజు త్వరలోనే రానుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Previous

కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు : మహిళలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి సన్నాహక సమావేశం

Read Next

నెల్లూరులో ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు…

Leave a Reply

Your email address will not be published.