నెల్లూరులో ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు…

Clock Of Nellore ( Nellore ) – రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. బాలాజీ నగర్ పిండి మిల్లు సెంటర్ లో శింగంశెట్టి అశోక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అలాగే 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ ప్రభాస్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆయన నటించే మరిన్ని సినిమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ యువసేన గౌరవ అధ్యక్షులు వంశీ కృష్ణ, అధ్యక్షులు శింగంశెట్టి అశోక్, సునిల్, ప్రసాద్, సుధ, అక్బర్, కిషన్, విజయ్, మునేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read Previous

రాష్ట్రం సుభిక్షంగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి

Read Next

సిఎం జగన్ నెల్లూరు పర్యటనకు చకచకా ఏర్పాట్లు : పర్యవేక్షించిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.