ఘనంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి జన్మదిన వేడుకలు – పలు చోట్ల సేవా కార్యక్రమాలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. పలువురు అభిమానులు ఆయనకు పుష్ప గుచ్చాలు సమర్పించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అతిపెద్ద కేకును కార్యకర్తల నడుమ కోటంరెడ్డి కట్ చేశారు. అలాగే నగర మేయర్ స్రవంతి, వైసీపి నేత జయవర్దన్, వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు సమక్షంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కేక్ కట్ చేయగా… వారంతా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డికి పుష్ప గుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల దంపతులు హరిత వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి కోటంరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు అన్నదానం చేశారు. శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఛైర్మైన్ రావు శ్రీనివాస రావు కోటంరెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకుని వాత్సల్య అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపి నేత మిద్దె మురళీ కృష్ణాయాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యి కేక్ కట్ చేశారు. ఇవే కాక నగరంలోని పలుచోట్ల కోటంరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు జరిగాయి.

Read Previous

చేయూత పథకం మహిళలు ఆత్మ గౌరవం : కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Read Next

రేపు గుండె వ్యాధులపై ఆవగాహన సదస్సు – సద్వినియోగం చేసుకోవాలన్న అపోలో

Leave a Reply

Your email address will not be published.