రేపు గుండె వ్యాధులపై ఆవగాహన సదస్సు – సద్వినియోగం చేసుకోవాలన్న అపోలో

  • ఈ నెల 28న ప్ర‌పంచ హృద‌య దినోత్స‌వం
  • అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం
  • ఉచిత గుండె ప‌రీక్ష‌లు
  • పాల్గొన‌నున్న సీనియ‌ర్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ భ‌క్త‌వ‌త్స‌ల రెడ్డి
  • టౌన్‌హాల్‌లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌

Clock Of Nellore ( Nellore ) – మాన‌వ దేహంలో గుండె ఎంతో ముఖ్య‌మైన‌ది. అటువంటి గుండెను ఎల్ల‌వేళ‌లా సంర‌క్షించుకోవ‌డం అంద‌రి బాధ్య‌త‌. గుండెకు సంబంధించిన వ్యాధులు, వ్యాధిల‌క్ష‌ణాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నెల్లూరు జిల్లా వాసుల‌కు గుండె వ్యాధుల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ స‌రికొత్త కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. దీనిపై మంగళవారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, కార్డియో తోరాసిక్ సర్జన్ డాక్టర్ విజ్ఞ చరణ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ షర్మిలితో కలిసి సీనియ‌ర్ ఇంర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ చిర్రా భ‌క్త‌వ‌త్స‌ల రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన ప్ర‌పంచ గుండె దినోత్స‌వం సంద‌ర్భంగా నెల్లూరులోని టౌన్‌హాల్‌లో సాయంత్రం 6 గంట‌ల‌కు గుండె వ్యాధుల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో తానే స్వయంగా గుండె వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తానని, అంతేకాకుండా ఆర్‌.బి.ఎస్‌, బిసి, ఇ.సి.జి వంటి ప‌రీక్ష‌ల‌ను కూడా ఉచితంగా నిర్వ‌హిస్తామన్నారు. ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో జిల్లా వాసులంతా పాల్గొని గుండె వ్యాధుల‌కు సంబంధించిన అన్నీ అనుమానాల‌ను నివృత్తి చేసుకోవాల‌ని డాక్టర్ భక్తవత్సల రెడ్డి కోరారు. మ‌రిన్ని వివ‌రాల కోసం 7660018706 నెంబ‌ర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు. 

Read Previous

ఘనంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి జన్మదిన వేడుకలు – పలు చోట్ల సేవా కార్యక్రమాలు

Read Next

జొన్నవాడ క్షేత్రాన్ని దర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి…

Leave a Reply

Your email address will not be published.