Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రామలింగాపురం వద్ద ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం నేపద్యంలో అటు వైపు గత కొద్ది రోజుల నుండి నిషేదంలో ఉన్న రాకపోకలు ఈనెల 25వ తేదీ నుండి యధాతథంగా అనుమతించనున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఫ్లై ఓవర్ వంతెన పనులను పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి పనులపై ఆరా తీశారు. వంతెన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వంతెన నిర్మాణం కోసం ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని, ట్రాఫిక్ మళ్లింపుతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే సహకరించారని పేర్కొన్నారు. గురువారం నుండి రామలింగాపురం నుండి ఆత్మకూరు బస్టాండ్ వైపు వెళ్లే దారిలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈనెల 25వ తేదీ నుండి అన్నీ వైపుల నుండి పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలను అనుమతి ఇస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసమే నూతనంగా ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామని కోటంరెడ్డి తెలియజేశారు. బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై త్వరలోనే వంతెనల నిర్మాణాలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలియజేశారు.
