నెల్లూరు జిల్లాలో దారుణం… ఆలయం చుట్టూ తిప్పి.. కుక్కతో కరిపించి

Clock Of Nellore ( Jonnawada ) – నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో దొంగ అనే అనుమానంతో ఓ యువకుడిపై మరో వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధిత యువకుడి మెడకు తాడు బిగించి.. కాళ్లతో తన్నుతూ హింసించాడు. జుట్టు పట్టి ఆలయం చుట్టూ ఈడ్చుతూ దాడి చేశాడు. పెంపుడు కుక్కతో కరిపించాడు. తాను దొంగను కాదని.. కుక్కను వదలడంతో భయపడి పరుగులు తీసినట్లు చెప్పినా వినిపించుకోలేదు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆలయం సమీపంలో నివాసముంటున్న రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు నుంచి ఇద్దరు యువకులు వెళుతుండగా… వారిని చూసి పెంపుడు కుక్క మొరిగింది. రమేష్ తన కుక్కను వదలడంతో.. ఓ యువకుడు పారిపోయాడు. మరొకరు ఆలయంలోకి పరుగులు తీయగా.. వెంటబడి పట్టుకుని దాడికి దిగాడు. రమేష్ ప్రవర్తనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు బాధితుడిని వదిలేశాడు.

Read Previous

ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం : నెల్లూరులో వ్యక్తి అరెస్ట్

Read Next

ఈనెల 25 నుంచి రాకపోకలు యధాతథం : ఫ్లై ఓవర్ పనులు పరిశీలించిన కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.