ఘనంగా వైఎస్ వర్ధంతి : నివాళి అర్పించిన ఎంపి, మంత్రి, ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) – దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు, వైసీపి నేతలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలోని కరెంటాఫీసు సెంటర్ లో ఉన్న వైఎస్ విగ్రహం వద్ద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

నెల్లూరు మాగుంట లే అవుట్ లో ఉన్న వైసీపి జిల్లా కార్యాలయంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ భానుశ్రీ, వైసీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవి రామిరెడ్డి, మాళెం సుధీర్ రెడ్డి, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పలువురికి వస్త్ర దానం చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని మంత్రి కాకాణి ప్రారంభించి రక్త దాతలను అభినందించారు.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు సంతపేటలోని వారి నివాసంలో వైఎస్ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ లో ఉన్న వైఎస్ విగ్రహానికి నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కొండూరు అనీల్, నూనె మల్లిఖార్జుల యాదవ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Read Previous

వినాయక చవితి వేడుకల్లో మాజీ మంత్రి అనీల్…

Read Next

కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి – పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్

Leave a Reply

Your email address will not be published.