కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి – పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్

Clock Of Nellore ( Nellore ) – దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మేయర్ స్రవంతి, డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మేయర్, డిప్యూటి మేయర్లు మాట్లాడుతూ మహోన్నత వ్యక్తిత్వం, వై.యస్.రాజశేఖర్ రెడ్డికే సొంతమని, పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన పథకాలు ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజు తెలుగు ప్రజలందరికీ చీకటి దినంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్ వ్యవస్థలతో ఎన్నో కుటుంబాలలో ఉచిత వైద్య సదుపాయం కల్పించి ఎందరికో ప్రాణదానం చేసిన ఘనత వై.యస్.ఆర్ కే చెల్లుతుందని మేయర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతుంటే ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం వచ్చేలా చర్యలు తీసుకున్నారని, ఆయన జ్ఞాపకార్ధం నెల్లూరు కార్పోరేషన్ కార్యాలయానికి అయన పేరు నామకరణం చేయడం అదృష్ఠంగా భావిస్తునవ్నట్లు పేర్కొన్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో కొ-ఆప్షన్ సభ్యులు మోబీనా, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు 12వ డివిజన్ లోని చింతారెడ్డిపాళెంలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మేయర్ దంపతులకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ విగ్రహానికి మేయర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించే విధానానికి రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తిత్వం రాజశేఖర్ రెడ్డికే సొంతమని, తెలుగు ప్రజల గుండెల్లో అయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని కొనియాడారు. రైతు బంధుగా నూతన వ్యవసాయ విధానాలతో వారి సంక్షేమానికి కృషి చేసి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన మహానేత వై.యస్.ఆర్ అని మేయర్ ప్రశంసించారు. పాలనకు మానవత్వాన్ని జోడించి సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో తెలుగు నేలపై తనదైన ముద్రను వేసిన దార్శనీకుడు రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి రూపకల్పన చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకుని అమలు చేశారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎంబేటి చిన్నబాబు, పంట్రంగి యేషయ్య, కేశవరెడ్డి, వాదనాల రాజేష్, శ్రీనాథ్, అనిల్, రవి, రాజేష్, లక్ష్మయ్య, యోనా తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఘనంగా వైఎస్ వర్ధంతి : నివాళి అర్పించిన ఎంపి, మంత్రి, ఎమ్మెల్యేలు

Read Next

పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే : వాటర్ బేస్ ప్రారంభోత్సవంలో మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.