నెల్లూరు సిటీలో పలు అభివృద్ధి పనులు – శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. 13వ డివిజన్ పరిధిలోని యలమవారిదిన్నెలో 70 లక్షలతో నిర్మించిన పార్కును స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునతో కలిసి ప్రారంభించారు. అలాగే అదే ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న అర్భన్ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవరావు, నుడా వైస్ ఛైర్మైన్ ఓబులేసు నందన్, వైసీపి నేత ఊటుకూరు చంద్ర పాల్గొన్నారు.

అలాగే 14వ డివిజన్ పరిధిలోని ఏసి నగర్ లో ఉన్న మల్లెల సంజీవయ్య మున్సిపల్ హైస్కూల్ లో నాడు – నేడు పథకం కింద 2.04 కోట్లతో నిర్మించనున్న 17 అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, మూలాపేట శివాలయంలో ఛైర్మైన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు – పరిశీలించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనీల్

Read Next

ప్రణాళిక బద్ధంగా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు – మంత్రి గోవర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.