ఎంపి బీద మస్తాన్ రావును కలిసిన నూర్ బాషా సంఘం నాయకులు

Clock Of Nellore ( Nellore ) – నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం నెల్లూరుజిల్లా అధ్యక్షులు షేక్ సలీం… రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరులోని BMR కార్యాలయంలో మస్తాన్ రావును కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. నూర్ బాషా ముస్లింల సంక్షేమం కోసం నిత్యం ముందుండే మస్తాన్ రావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా వారు కాంక్షించారు. అనంతరం బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ నూర్ బాషా ముస్లింలు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకునేందుకు వీలుగా బ్యాంకు ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే మహిళలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయిస్తానన్నారు. అంతే కాకుండా 10వ తరగతి, ఇంటర్ లో ప్రతిభ చూపిన నూర్ బాషా విద్యార్ధులకు ప్రోత్సహ బహుమతులు అందజేస్తానని వెల్లడించారు. అనంతరం నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం నేతలు ఎంపికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సలీంతో పాటూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాదర్ బాషా, బాబర్ జాన్, యూత్ నాయకులు షరీఫ్ పాల్గొన్నారు.

Read Previous

ఇల్లు కోల్పోతే ఇళ్లు నిర్మించి ఇస్తాం : స్పష్టం చేసిన ఎమ్మెల్యే అనీల్

Read Next

కృష్ణపట్నం కాలువకు గోడ నిర్మాణం : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనీల్

Leave a Reply

Your email address will not be published.