కృష్ణపట్నం కాలువకు గోడ నిర్మాణం : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నుండి కృష్ణపట్నం వెళ్లే పంట కాలువకు రెండు వైపులా గోడ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నెల్లూరు నగర పరిధి వరకూ నిర్మించే ఈ గోడ నిర్మాణ పనులకు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మంగళవారం గుర్రాల మడుగు సంఘం వద్ద శంఖుస్థాపన చేశారు. ఈ గోడ నిర్మాణం వద్ద గుర్రాల మడుగు, దానికి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి కాలువ నుండి రక్షణ ఉంటుందని అన్నారు. త్వరితగతిన పనులు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, వైసీపి నేతలు గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, బాలాజీ నగర్ సిఐ మధుబాబు పాల్గొన్నారు.

Read Previous

ఎంపి బీద మస్తాన్ రావును కలిసిన నూర్ బాషా సంఘం నాయకులు

Read Next

ఆత్మకూరులో విస్త్రృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు…

Leave a Reply

Your email address will not be published.