జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా… 6 మందికి గాయాలు

Clock Of Nellore ( DV Satram ) – తిరుపతిజిల్లా దొరవారి సత్రం మండలం, కృష్ణాపురం వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తుండగా మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై అదుపుతప్పింది. అతి వేగంతో అదుపుతప్పిన బస్సు మధ్యలోని డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణిస్తుండగా, వారిలో ఆరు మంది గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దొరవారి సత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు షమ్మ సర్ధార్ ట్రావెల్స్ కు చెందినది. డ్రైవర్ షడన్ గా బ్రేక్ వేయడంతోనే బోల్తా పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది.

Read Previous

కందుకూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు : ప్రారంభించిన ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి

Read Next

జాతీయ రహదారిపై కారు నుజ్జు నుజ్జు – కారులోని వారు అదృశ్యం

Leave a Reply

Your email address will not be published.