మంత్రి కాకాణికి ఆన్ లైన్ లోన్ రికవరీ ఏజెంట్ల ఫోన్… అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – తెలుగు రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. రికవరీ విషయంలో ఏకంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డినే ఏజెంట్లు బెదిరింపులకు గురిచేశారు. లోన్‌ కట్టకపోతే పిల్లలను చంపేస్తామంటూ ఫోన్ లో మాట్లాడిన కాకాణి పిఏ శంకర్ కు వార్నింగ్‌ ఇవ్వడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్ల ఆగడాలను శంకర్‌ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తెలపగా ఆయన జిల్లా ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు, మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు. దీనిపై మంత్రి కాకాణి మాట్లాడుతూ లోన్ రికవరీ పేరుతో ఎవరైనా వేధింపులకు గురి చేస్తే పరువు పోతుందని అఘాయిత్యాలకు పాల్పడవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో ఇద్దరు ఏఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి…

Read Next

గూడూరులో దారుణ హత్య… శవాన్ని గోనెసంచిలో ఉంచి కాలువలో పడేసిన నిందితులు

Leave a Reply

Your email address will not be published.