గ్రంధాలయాల్లో డిజిటల్ పుస్తకాలు… వెల్లడించిన దొంతు శారద

Clock Of Nellore ( Nellore ) – జిల్లాలోని అన్నీ గ్రంధాలయాల్లో పాఠకులకు ఇబ్బంది లేకుండా డిజిటలైజేషన్ ఆఫ్ బుక్స్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు అవసరమైన టేబుల్స్, కుర్చీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ  ఛైర్ – పర్సన్ దొంతు శారద పేర్కొన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థకు సంబంధించి 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేటాయించిన బడ్జెట్ ఆమోదం నిమిత్తం బుధవారం నెల్లూరులోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో చైర్ పర్సన్ దొంతు శారద అధ్యక్షతన గ్రంధాలయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేటాయించిన బడ్జెట్ పద్దులకు అనుగుణంగా వివిధ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన అనుమతులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంలో ఛైర్ పర్సన్ దొంతు శారద మాట్లాడుతూ, జిల్లాలోని అన్నీ గ్రంధాలయాల్లో పాఠకులకు ఇబ్బంది లేకుండా డిజిటలైజేషన్ ఆఫ్ బుక్స్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 3 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులు జరుగుచున్నవని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్ పర్సన్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజ, సూపరింటెండెంట్ ప్రసాద్, వయోజన విద్య, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఫోన్ కాల్ కు స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి… ఆ ప్రాంతానికి పయనం

Read Next

పాఠశాలల విలీనంపై భగ్గుమన్న విద్యార్ధి లోకం… అనేక చోట్ల నిరసనలు

Leave a Reply

Your email address will not be published.