పాఠశాలల విలీనంపై భగ్గుమన్న విద్యార్ధి లోకం… అనేక చోట్ల నిరసనలు

Clock Of Nellore ( Buero Report ) – 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకూ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకూ విద్యాభోదన ఒకే పాఠశాలలో సాగేవి. అయితే ప్రభుత్వం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ఆయా తరగతుల విద్యార్ధులు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభం కావడంతో దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరుజిల్లాలోని అనేక చోట్ల విద్యార్ధులతో పాటూ తల్లిదండ్రులు కూడా నిరసనలు తెలియజేశారు. సంగం మండలం, జెండాదిబ్బ గ్రామంలోని స్కూలుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. జెండాదిబ్బ స్కూలును అన్నారెడ్డిపాళెంకు తరలించారని, అంత దూరం తమ పిల్లలు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. వరికుంటపాడు మండలం, కాకొల్లువారిపల్లి స్కూల్ ను కూడా ఇతర పాఠశాలకు తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గుడ్లూరులో కూడా పిల్లల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.

Read Previous

గ్రంధాలయాల్లో డిజిటల్ పుస్తకాలు… వెల్లడించిన దొంతు శారద

Read Next

నెల్లూరును మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతాం : సమీక్షలో మంత్రి కాకాణి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.