తిరుమలకు సాగుతున్న వైసీపి నేత జయవర్ధన్ పాదయాత్ర….

Clock Of Nellore ( Gudur ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వై.సీ.పీ నాయకులు జయవర్ధన్ చేపట్టిన “శ్రీధరన్న కోసం నెల్లూరు నుండి తిరుమల పాదయాత్ర” 3వ రోజుకు చేరుకుంది. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడపగడపకు కార్యక్రమంలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగుతూ తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆయన క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత నెల్లూరు నుండి తిరుమలకు కాలినడకన వస్తామని మేయర్ దంపతులు పూజ చేయడం జరిగింది. మంగళవారం నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి మొదలైన పాదయాత్ర గురువారం నాడు 3వ రోజుకి చేరుకుంది. 3వ రోజు ఉదయం పుట్టంరాజు కండ్రిగ నుండి వెంకటగిరి వైపుకు సాగింది. ఈ సందర్భంగా వై.సీ.పీ నాయకులు జయవర్ధన్ మాట్లాడుతూ తనలాంటి సామాన్య కార్యకర్తలను ఉన్నత స్థాయిలో నిలపడం కోసం అనుక్షణం పరితపించే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నాయకులు తమకు తోడుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని, అటువంటి నాయకునికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఎంతోమంది కార్యకర్తలకు అండగా నిలిచే శక్తి సామర్ధ్యాలను ఇవ్వాలని ప్రార్ధిస్తూ నెల్లూరు నుండి తిరుమలకు కాలినడకన వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ 20, 21, 22, 23, 24, 35 వ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

రైల్లో నుండి జారి పడి వ్యక్తి మృత్యువాత…

Read Next

జాతీయ స్థాయి పోటీలకు నెల్లూరు క్రీడాకారులు… అభినందించిన నుడా ఛైర్మైన్

Leave a Reply

Your email address will not be published.