
Clock Of Nellore ( Nellore ) – ఈనెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకూ పాండిచ్చేరిలో జరగనున్న సీనియర్ జాతీయ స్థాయి ఆట్యా ఆట్యా పోటీలకు నెల్లూరు క్రీడాకారులు ఎంపికైనారు. డి. అనూష, పి. నవీన్, డి. మురళీ, సిహెచ్ వర్షిత్ రెడ్డిలు ఎంపిక కాగా వారిని నుడా ఛైర్మైన్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముక్కాల ద్వారకానాథ్ వారి కార్యాలయంలో అభినందించారు. అలాగే వారికి నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి పాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి చేరాలని కాంక్షించారు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న క్రీడలకు తమ ఫౌండేషన్ ద్వారా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నిమ్మల వీర వెంకటేశ్వర్లు, సభ్యులు పబ్బిశెట్టి శ్రీనివాసులు, వెంగళరావు నగర్ మున్సిపల్ స్కూల్ పిఈటి అజయ్ బాబు పాల్గొన్నారు.