Clock Of Nellore ( Manubolu ) – రైల్లో ఫుట్ పాత్ పై ప్రయాణం చేస్తూ ప్రమాదవ శాత్తూ జారి పడి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డ సంఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ – నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ మధ్య రైల్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని ప్రమాదవశాత్తూ జారి పడి గాయాలతో చనిపోయాడని తెలిపారు. ఎరుపు రంగు చెక్స్ చొక్కా ధరించి ఉన్న ఆ వ్యక్తి బ్లూ రంగు ప్యాంటు ధరించి ఉన్నారన్నారు. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Rly Accidents